లాస్ట్ సండే చర్చ్ లో ఏ ప్రసంగం విన్నావో గుర్తుందా ?
✝ Christ Temple - Proddatur 🔅 లాస్ట్ సండే చర్చ్ లో ఏ ప్రసంగం విన్నావో గుర్తుందా ? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యులు ప్రకటన 1 : 3. ఒక లాయరు, ఒక పాస్టరు, ఒక డాక్టరు కలసి ఒక నదీతీరములో ఉన్న బాతులను వేటాడుటకు వెళ్లారు. అక్కడ చాల బాతులు ఉన్నవి. ముగ్గురూ తమ తుపాకీలను గురి పెట్టి కాల్చారు. ఒకే బాతు పడిపోయింది. మిగిలిన బాతులన్నీ ఎగిరిపోయాయి. ముగ్గురూ పరుగెత్తి పడిపోయిన బాతు దగ్గరకు చేరారు. 'నేను కొట్టిన తుపాకీ దెబ్బకే ఇది చచ్చిపోయింది. కాబట్టి ఇది నాది' అన్నాడు లాయరు. డాక్టర్ 'నేను కొట్టిన బుల్లెట్‌తో ఇది చచ్చింది' అన్నాడు. పాస్టరు 'కాదు నేను ఈ బాతుకే గురిపెట్టాను' అన్నాడు. బాతుకు ఒకే బుల్లెట్ తగిలింది. ఎవరి బుల్లెట్ వల్ల తగిలిందో నిర్ణయించడం ఎలా? ఆ దారిన ఒక మహా జ్ఞాని వెళ్లుచూ వీరి కలహం విని 'ఎందుకు మీరు కలహించుకుంటున్నారు?' అని అడిగాడు. వారు ముగ్గురూ జరిగింది చెప్పారు. 'నేను నిర్ణయిస్తాను. ముందు దానికి బుల్లెట్ ఎక్కడ తగిలిందో నన్ను చూడనివ్వండి' అన్నాడు. ఐదు సెకన్ల త...