నీ ఇంటిని చక్కబెట్టుకో
నీ ఇంటిని చక్కబెట్టుకో
నీ ఇంటిని చక్కబెట్టుకో
నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యోహోవా సెలవిచ్చెను. 2 రాజులు 20:1-5
క్రీస్తునందు ప్రియ ప్రియపాఠకులారా యేసు నామమున మీకు శుభము కలుగును గాక !
ప్రస్తుతం ఈ లోకంలో జరుగుతున్న హడావిడి ఒకటే. ఇల్లు కట్టడం, ఇల్లు అమ్మడం మనం తరచుగా చూస్తున్నాం. ఈ పరంపరలో చాలామంది పెండ్లిండ్లు చేసి ఇల్లు అమ్మేవారు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇల్లు అమ్మేవారు, సరైన ఆదాయం రావడం లేదని ఇల్లు అమ్ముతారు. కారణం బాడుగకు ఇల్లు ఇచ్చినప్పుడు వారు చెప్పినట్లు వినే వారు ఇచ్చిన డబ్బులతో తృప్తి చెందక, ఖాళీ చేయ్యి, ఖాళి చేయ్యి అని చెప్తూ ఉంటారు. ఈలాంటి ఘోరమైన రోజులలో మనం జీవిస్తున్నాం.
ఇల్లు రెండు రకాలు
1.మనం నివసించే ఇల్లు
2.మన కుటుంబం అనే ఇల్లు
మొదటి ఇల్లు స్థిరమైనది కాదు, ఎన్ని లక్షలు పెట్టి కట్టించుకొన్నా, ఎన్ని కోట్లు పెట్టి కట్టించుకొన్నా ఏదో ఒకరోజు వదిలి పోవాల్సిందే.
రెండవ ఇంటిని చూస్తే ఈ ఇంటిలో ఉండే కుటుంబము ఐక్యమత్యంతో జీవిస్తే దీర్ఘ కాలం జీవిస్తారు లేకపోతే అది కూడా జరగకపోవచ్చు.
బైబిల్ గ్రంథంలో 1 రాజులు 20:1- 15 వరకు మనం చదివినట్లయితే అక్కడ హిజ్కియా రాజు యొక్క జీవితాన్ని మనం చూస్తాం.
ఈ హిజ్కియా బాల్య జీవితం ఎంతో గొప్పదైనది. అతని తల్లి హిజ్కియాను దైవభక్తిలో పెంచింది. తత్ఫలితంగా 25 సంవత్సరాల వయస్సులోనే రాజైనట్లు చూడగలుగుతాము. 1 దినవృత్తాంతములు 29 వ అధ్యాయంలో తన రాజ్యంలో ఆయన చేసిన మంచి పనులు
1 మందిర తలుపులు తెరిచి, బాగు చేయించాడు 29: 3
2.నిషిద్ధ వస్తువులన్నీ బయటికి పారద్రోలినాడు 5వ
3.మందిరమును ప్రతిష్టించినాడు
4. పెందలకడలేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని మందిరమునకు వెళ్లేవాడు20 వ
ఇంకా ఎన్నెన్నో చేసాను. ఇలాంటి గొప్ప కార్యములు చేసిన వ్యక్తి అనతికాలంలోనే దేవుని దృష్టిలో అనైతికంగా ప్రవర్తించాడు.
అతని బలహీనతలు
1. శత్రువులతో రాజకీయ స్నేహం ప్రారంభించాడు. 2.ఉన్నత స్థలములలోని బలిపీఠమును పడగొట్టిచెను.
3. మనసున గర్వించెను
4. తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదు.
దీనికంతటికీ కారణం తన ఐశ్వర్యమే. తన ఐశ్వర్యం అనే గ్రుడ్డి తనము తో దేవుని మరచి నందుకు దేవుడే మరణకరమైన రోగమును పంపాడు. రోగాలు ఎన్నెన్నో చూస్తుంటాము,కొన్ని రోగాలు మనిషి ప్రాణాలు తీస్తాయి, కొన్ని తీయవు ,అయితే బైబిల్ వాటి గురించి స్పష్టంగా చెబుతుంది. 1 యోహాను 5: 18 ,19 వచనాలు చూస్తే భక్తుడైన యోహాను రెండు విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు.
1. మరణంకరము కానీ పాపము చేయగా అతడు రోగియై పరుండినప్పుడు తన సహోదరుడు అతని గురించి దేవుని వేడుకుంటే దేవుడతనిని మరణం నుండి కాపాడుతాడు.
2. మరణకరమైన పాపము చేయగా అట్టి వానిని గురించి వేడుకొనవలెనని నేను చెప్పటలేదు అంటున్నాడు. దాని అర్థం అది ఎంత విషమైనదో మనం గమనించగలం.
💠 Christ Temple - Proddatur