ఐ యాం వెరీ సారీ

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm.in Proddatur. For more Details  : +91 8142229281.

✳ ఐ యాం వెరీ సారీ 

 క్షమాపణ హింస లేకుండానే వివాదాలను పరిష్కరిస్తాయి,
దేశాల మధ్య ఏర్పడిన చీలికలను కూడా సరిచేస్తాయి.

👉పాడైన సంబంధాలను మెరుగుపరచుకోవడానికి నిజాయితీగా క్షమించమని అడగడం ఒక ప్రభావవంతమైన మార్గమని బైబిలు ధృవీకరిస్తోంది.

👉 తప్పిపోయిన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమానంలో, కుమారుడు ఇంటికి తిరిగి వచ్చి హృదయపూర్వకంగా క్షమించమని అడిగినప్పుడు, తండ్రి అతడిని తిరిగి ఇంట్లోకి చేర్చుకోవడానికి ఎంతో ఆత్రుత చూపించాడు. (లూకా 15:17-24)

👉అవును,

ఒక వ్యక్తి అహంకార భావాలను ప్రక్కనపెట్టి, క్షమించమని అడగడానికి గర్వం ఎన్నడూ అడ్డురాకూడదు.

🔹 క్షమాపణ చెప్పడం నిజంగా వినయస్థులైన వ్యక్తులకు అంత కష్టమేమీ కాదన్నది వాస్తవం.

  క్షమాపణకున్న శక్తి

👉ప్రాచీన ఇశ్రాయేలుకు చె౦దిన జ్ఞానవ౦తురాలైన అబీగయీలు తన భర్త చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నప్పటికీ,

క్షమాపణ యొక్క శక్తికి ఒక మంచి ఉదాహరణగా ఉ౦డేలా ఆమె ప్రవర్తి౦చి౦ది.

🔺దావీదు తాను అరణ్య౦లో నివసిస్తున్నప్పుడు తన మనుష్యులతో కలిసి, అబీగయీలు భర్త అయిన నాబాలుకు చె౦దిన మ౦దలను కాపాడాడు, ఈయన ఆ తర్వాత ఇశ్రాయేలుకు రాజయ్యాడు. అయితే, దావీదుతో ఉన్న యౌవనస్థులు రొట్టె నీళ్ళ కోస౦ అడిగినప్పుడు, నాబాలు వారితో అవమానకర౦గా మాట్లాడి వారిని ప౦పి౦చివేశాడు. దానితో ఉగ్రుడైన దావీదు తనతోపాటు దాదాపు 400 మ౦ది పురుషులను వె౦టబెట్టుకుని నాబాలు మీదికి, ఆయన కుటు౦బ౦ మీదికి యుద్ధానికి బయలుదేరాడు. ఈ విషయ౦ తెలుసుకున్న అబీగయీలు దావీదును కలవడానికి బయల్దేరి౦ది.

ఆమె ఆయనను కలుసుకుని ఆయనకు సాష్టా౦గ నమస్కారము చేసి౦ది. తర్వాత ఆమె ఇలా అన్నది.

“నా యేలినవాడా, యీ దోషము నాదని యె౦చుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడ నిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పుమాటలను ఆలకి౦చుము.”
👉 తర్వాత అబీగయీలు దావీదుకు పరిస్థితిని వివరి౦చి, ఆయనకు ఆహారాన్ని పానీయాలను కానుకగా ఇచ్చింది. దానికి ఆయనిలా అన్నాడు:
*“నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించితిని, సమాధానముగా నీ యింటికి పొ[మ్ము].”
—⁠1 సమూయేలు 25:2-35.

👉అబీగయీలుకున్న వినయ స్వభావం,
👉తన భర్త దురుసు ప్రవర్తనకు ఆమె క్షమాపణ చెప్పడం ఆమె ఇంటి వారిని రక్షించాయి.
👉 పగతీర్చుకొనకు౦డ ఆపిన౦దుకు దావీదు ఆమెకు కృతజ్ఞతలు కూడా తెలియజేశాడు.

దావీదుతోనూ ఆయన మనుష్యులతోనూ దురుసుగా ప్రవర్తి౦చి౦ది అబీగయీలు కాకపోయినా, ఆమె తన కుటు౦బ౦ తరపున ని౦దను అ౦గీకరి౦చి దావీదుతో సమాధానపడి౦ది.

కాబట్టి క్షమాపణ చెప్పడం సమాధానపడడానికి తోడ్పడుతుంది.

🔹అవును, మన పొరపాట్లను అంగీకరించి చేసిన నష్టానికి క్షమాపణ చెప్పుకోవడం నిర్మాణాత్మకమైన చర్చలకు అవకాశాలను కలిగిస్తుంది.

👉 ‘కానీ నేను ఏ తప్పూ చేయలేదు’

👉మనం అన్నదాన్ని బట్టి లేదా చేసినదాన్ని బట్టి ఎవరికైనా బాధ కలిగిందని మనకు తెలిసినప్పుడు ఆ వ్యక్తి నిర్హేతుకంగా ప్రవర్తిస్తున్నాడనో మరీ అతిగా ప్రతిస్పందిస్తున్నాడనో మనకు అనిపించవచ్చు.

👉 ఈ సూత్రాన్ని మనస్సులో ఉంచుకోవడం, మనం తమ పట్ల తప్పు చేశామని భావించే వారికి క్షమాపణ చెప్పడం సులభమయ్యేలా చేస్తుంది.

👉మనం యథార్థంగా క్షమాపణ చెబుతున్నట్లయితే, మనం మన తప్పును ఒప్పుకుని, క్షమించమని అడిగి, సాధ్యమైనంత మేరకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ప్రయత్నిస్తాము. దానికి ప్రతిస్పందనగా, గాయపర్చబడిన వ్యక్తి కూడా పశ్చాత్తాపపడుతున్న తప్పిదస్థుడ్ని వెంటనే క్షమించాలి.
(మత్తయి 18:21, 22; మార్కు 11:25;ఎఫెసీయులు 4:32; కొలొస్సయులు 3:13)

👉 ఇరువర్గాల వారూ అపరిపూర్ణులే గనుక సమాధానపడడం ఎల్లప్పుడూ అంత సరళంగా జరగకపోవచ్చు.
👉అయినప్పటికీ సమాధానపడడంలో క్షమాపణ చెప్పడం బలమైన ప్రభావంగా పనిచేస్తుంది.

మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.

ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!

▪ CHRIST TEMPLE-PRODDATUR ▪

Comments